ప్రత్యేక రైళ్ల కోసం ఎవరూ రైల్వే స్టేషన్లకు రావొద్దని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. శ్రామిక్ రైళ్లలో తమను స్వస్థలాలకు పంపించాలని దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్‌కు వలస కూలీలతో పాటు విద్యార్థులు, యాత్రికులు నుంచి పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు వస్తున్నాయి. వలస కూలీలు కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి తదితర స్టేషన్లకు భారీగా తరలి వస్తున్నారు.
'ప్రత్యేక రైల్లో ప్రయాణానికి ఈ నంబర్లలో సంప్రదించండి' - secunderabad
తమను స్వస్థలాలకు పంపించాలంటూ వలస కూలీలు కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి తదితర స్టేషన్లకు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక రైళ్ల కోసం ఎవరూ రైల్వే స్టేషన్లకు రావొద్దని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ నంబర్లను సంప్రదించాలని కోరుతున్నారు.
'స్టేషన్లకు రాకండి.. సహాయ నంబర్లను సంప్రదించండి'
ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు స్పందించి.. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే తాము రైళ్లను నడుపుతున్నామని, ప్రత్యేక రైళ్ల కోసం ఎవరూ స్టేషన్లకు రావొద్దని సూచిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ నంబర్లు 040-23450624, 23450735, 100, వాట్సప్ నంబర్లు 90102 03526, 79979 50008లో సంప్రదించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: పనుల్లో వేగం పెంచండి... రైల్వే శాఖకు కేటీఆర్ విజ్ఞప్తి