తెలంగాణ

telangana

ETV Bharat / state

సరకు రవాణా నష్టాన్ని తగ్గించేందుకు రైల్వే చర్యలు - telangana news

సరకు రవాణా నష్టాన్ని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ఉత్పత్తి కేంద్రం నుంచి నేరుగా వినియోగదారునికి సరకు చేరే విధానానికి శ్రీకారం చుట్టింది.

south central railway
ఉత్పత్తి కేంద్రం నుంచి నేరుగా వినియోగదారుడికి సరకు సరఫరా

By

Published : Apr 1, 2021, 6:01 AM IST

ఉత్పత్తి కేంద్రం నుంచి నేరుగా వినియోగదారుడికి సరకును అందించే విధానాన్ని దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. సికింద్రాబాద్‌ డివిజన్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా.. సిమెంట్‌తో కూడిన రేక్​ను వినియోగదారుడి వద్దకు పంపింది.

మొదటి రేక్‌.. జగ్గయ్యపేటలోని ఓ సిమెంట్‌ ఉత్పత్తి కేంద్రం నుంచి పశ్చిమ బంగాలోని షాలిమార్‌, కోల్​కతాకు బయలుదేరింది. కర్మాగారం నుంచి రైల్వేకు, రైల్వే నుంచి వేర్‌హౌస్‌కు, అక్కడి నుంచి డీలర్లు, చివరికి వినియోగదారుడి వద్దకు చేరే పరిస్థితి ఉండేదని.. ప్రస్తుత సదుపాయం ద్వారా సరఫరాదారుడు, వినియోగదారుడికి ఒకే స్టాప్‌తో కూడిన రవాణా సౌకర్యం అందుబాటులో వచ్చిందని రైల్వే అధికారులు తెలిపారు. రవాణా మార్గంలో సరకు రవాణా నష్టాన్ని తగ్గిస్తుందన్నారు.

ఇవీచూడండి:వేసవి ఆరంభంలోనే నిప్పులు కక్కుతున్న భానుడు

ABOUT THE AUTHOR

...view details