తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్పందించకపోతే రైల్వే సమ్మె తప్పదు'​

కార్మికుల హక్కులను కాలరాస్తూ, చట్టాలను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సౌత్​సెంట్రల్​ రైల్వే మజ్దూర్​ యూనియన్​ జాతీయ కార్యదర్శి సీ హెచ్​ శంకర్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనస్​ దినోత్సవం సందర్భంగా నాంపల్లి సౌత్​ సెంట్రల్​ రైల్వే యూనియన్​ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

By

Published : May 9, 2019, 3:53 PM IST

railway-mazdur-sangh

కాంగ్రెస్​, భాజపా ప్రభుత్వాలు కార్మికులకు ఇన్సెంటివ్స్​, ప్రమోషన్స్​ లేకుండా చేశాయని సౌత్​సెంట్రల్​ రైల్వే మజ్దూర్​ యూనియన్​ జాతీయ కార్యదర్శి సీహెచ్​ శంకర్​రావు ఆరోపించారు. నూతన పింఛన్​ విధానంతో కార్మికులు తీవ్రంగా నష్టంపోతున్నారన్నారు. పాత పింఛన్​ విధానాన్ని ప్రవేశపెట్టే వరకూ పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రైల్వే కార్మికుల సమ్మె తప్పదని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలోకి రాబోయే కొత్త ప్రభుత్వమైనా తమకు అండగా ఉంటుందని ఆశాభావం వ్యంక్తం చేశారు.

'స్పందించకపోతే రైల్వే సమ్మె తప్పదు'​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details