రైల్వే భద్రత, సమయపాలనపై జీఎం గజానన్ మాల్యా సమీక్ష నిర్వహించారు. ముఖ్యమైన కేంద్రాలు, క్రాసింగ్ల వద్ద సమగ్ర తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో సమయస్ఫూర్తిని ప్రదర్శించిన దక్షిణ మధ్య రైల్వే జోన్కు చెందిన ఆరుగురు ఉద్యోగులకు రైల్ నిలయంలో జీఎం 'మ్యాన్ ఆఫ్ ది మంత్' అవార్డులను ప్రదానం చేశారు. సమావేశంలో విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల డీఆర్ఎంలు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
'రైల్వే భద్రత,సమయపాలనపై జీఎం ఉన్నత స్థాయి సమీక్ష' - RAILWAY LEVEL CROSSING
రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద భద్రతను పెంచే విధంగా దృష్టి సారించాలని డివిజన్ అధికారులకు జీఎం గజానన్ మాల్యా సూచించారు.
ముఖ్యమైన కేంద్రాలు, క్రాసింగ్ల వద్ద సమగ్ర తనిఖీలు నిర్వహించాలి: జీఎం