తెలంగాణ

telangana

ETV Bharat / state

MMTS: 2024 జనవరి నాటికి అందుబాటులోకి ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు - Indian Railways

South Central Railway Revenue: దక్షిణ మధ్య రైల్వేలో 49.8 కిలోమీటర్ల వరకు కొత్త లైన్లు ఏర్పాటు చేసినట్లు రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు 2024 జనవరి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఈ ఏడాది దక్షిణ మద్య రైల్వే సాధించిన పురోగతి, ఆదాయం, వసూళ్లు, విజయాల గురించి వివరించారు.

MMTS
MMTS

By

Published : Apr 17, 2023, 7:42 PM IST

South Central Railway Revenue: ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు 2024 జనవరి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రద్దీ తగ్గించడంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే చేపడుతున్న చర్లపల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం దాదాపు పూర్తి దశకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. చర్లపల్లి టర్మినల్ వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే సాధించిన విజయాలను ఆయన వివరించారు.

దక్షిణ మధ్య రైల్వేలో 49.8 కిలోమీటర్ల వరకు కొత్త లైన్లు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. 15.6 కి.మీ భావనపాలెం-సత్తుపల్లి, 12.7కి.మీలు క్రిష్ణా-మగనూర్, 21.5 కి.మీలు కొడకండ్ల-దుద్దెడ ప్రాంతాల్లో కొత్త లైన్ల నిర్మాణం చేపట్టామన్నారు. 151.38 కి.మీల మేర డబ్లింగ్ పనులను, 182.17 కి.మీల త్రిబ్లింగ్ ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తయ్యాయన్నారు. రైళ్ల వేగాన్ని 130 కిలోమీటర్ల వరకు పెంచామన్నారు. సికింద్రాబాద్-కాజీపేట్ రూట్​ను గోల్డెన్ డయాగ్నల్ రూట్​గా జీఎం అభివర్ణించారు.

9 మందిపై కేసులు నమోదు: 1743.42 కి.మీల రూట్​లో ఈ వేగాన్ని పెంచామన్నారు. రైల్వే ఆస్తులు ప్రభుత్వ ఆస్తులని.. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వందేభారత్ రైళ్లపై దాడులు చేసిన వారిపై 9 కేసులు నమోదు చేశామన్నారు. దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జోన్ నుంచి 131.854 మిలియన్ టన్నుల సరకు రవాణా చేసినట్లు తెలిపారు. ఇది జోన్ చరిత్రలో అత్యుత్తమ సరకు రవాణా అని ఆయన వివరించారు.

గత సంవత్సరం 117.797 మిలియన్ టన్నులు, 2018-19లో 122.5 మిలియన్ టన్నులు సరకు రవాణా చేసినట్లు ఆయన వెల్లడించారు. 2022-22లో 127 మిలియన్ల ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించారని, 2022-23లో 255 మిలియన్ల ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించారన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.391 కోట్ల విలువ గల స్క్రాప్​ను విక్రయించామన్నారు.

రైల్వే ఆదాయం ఎంతంటే?: సరకు రవాణాతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.13 వేల 51.10 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. గత సంవత్సరం రూ.10 వేల 615.68 కోట్లు, 2018-19లో రూ.10 వేల 954.69 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆయన వివరించారు. ప్రయాణికుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేల 140.70 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గతేడాది రూ.29 వేల 74.62 కోట్లు, 2018-19లో రూ.4 వేల 89.78 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.

స్థూల ఆదాయం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.18వేల 973.14 కోట్ల స్థూల ఆదాయం నమోదు చేసినట్లు ప్రకటించారు. ఇది జోన్ ప్రారంభించినప్పటి నుంచి అత్యధికంగా ఆర్జించిన ఆదాయంగా పేర్కొన్నారు. గత సంవత్సరం రూ. 14వేల266.04 కోట్లు, 2018-19లో రూ. 15వేల 708.88 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. టికెట్ లేకుండా ప్రయాణించడం.. లగేజీ తీసుకెళ్లిన వారి నుంచి రూ.211.26 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

రేపటి నుంచి ఆ మార్గాల్లో పరుగులు పెట్టనున్న ఎంఎంటీఎస్ రైళ్లు

ప్రధాని హైదరాబాద్ పర్యటన.. రూ.11వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

'మరణంలోనూ.. నేనున్నానని.. నీతో వస్తానని'.. భద్రాద్రి దంపతుల హార్ట్ ​టచింగ్ స్టోరీ

ABOUT THE AUTHOR

...view details