తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ ఎనిమిది రోజులు అవగాహన సదస్సులు, ర్యాలీలే' - railway employees

మహిళలపై జరుగుతున్న వేధింపులు, ఉద్యోగంలో సమాన హక్కులపై దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

'ఆ 8 రోజులు అవగాహన సదస్సులు, ర్యాలీలే'

By

Published : Nov 25, 2019, 4:08 PM IST

సమాన హక్కులు, వేధింపులపై అవగాహన కల్పిస్తూ సికింద్రాబాద్​లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్​ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమా నాగేంద్రమణి ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించారు. మహిళా విభాగం ఆధ్వర్యంలో 8 రోజులు అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తామని ఉమా తెలిపారు.

'ఆ 8 రోజులు అవగాహన సదస్సులు, ర్యాలీలే'
పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై అరాచకాలు, లైంగిక వేధింపుల నివారణకై కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ఐ.ఎల్.ఓ కన్వెన్షన్ 190ను వెంటనే ఆమోదించి అమలు చేయాలని ఉమ డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details