హైదరాబాద్ మలక్పేట సర్కిల్ ఆజంపురా ఆర్యూబీ వద్ద నాలా పక్కన రక్షణ గోడ విషయంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై ఈనాడు- ఈటీవీ భారత్లో కథనం ప్రసారమైనా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. రక్షణ గోడ నిర్మాణం కోసం నాలాలో తవ్విన మట్టిని తిరిగి నాలాలోనే పోయడంతో భారీ వర్షాలకు ఆ మట్టి రోడ్లపైకి కొట్టుకువస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ఆర్యూబీ వంతెన వద్ద నాలా పూడుకుపోయే ప్రమాదం ఉంది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Ajampura rub: రైల్వే గుత్తేదారు నిర్వాకం.. పెరిగిన వాహనాల రద్దీ.!
వర్షాకాలం ఆరంభమైందంటే చాలు భాగ్యనగర రహదారులు చెరువులను తలపిస్తాయి. రోజువారీ కార్యక్రమాల మీద బయటకు వెళ్లినవారు ఆ రోడ్ల మీద నుంచి ఇంటికి వెళ్లడమంటే పెద్ద సాహసమనే చెప్పాలి. ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుందో ఎక్కడ కాలువ ఉంటుందో అర్థం కాక.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నడవాలి. ఈ సమస్యలకు పరిష్కారాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. అది మాటలకే పరిమితం అవుతుంది. ఓ వైపు కాంట్రాక్టర్ల అలసత్వం కూడా కారణమే.. దానికి నిదర్శనమే ఆజంపురా నాలా పనులు.
ఆజంపురా
రైల్వేై గుత్తాదారు నిర్వాకంతో నాలాలో పోసిన మట్టి.. వర్షానికి రోడ్డుపైకి రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల కొద్దీ వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకోకపోతే నాలా కూడుకుపోయే ప్రమాదం ఉంది.
ఇదీ చదవండి:CPI RALLY: కేసీఆర్ సర్కారుపై తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది: కూనంనేని