తెలంగాణ

telangana

ETV Bharat / state

జీతాలు చెల్లించాలని కోరుతూ రైల్వే కాంట్రాక్టు కార్మికుల ధర్నా - హైదరాబాద్​ తాజా వార్తలు

రైల్వేలో కాంట్రాక్ట్​ కార్మికులకు పెండింగ్​ జీతాలను చెల్లించాలని డిమాండ్​ చేస్తూ కార్మికులు ధర్నా చేశారు. సికింద్రాబాద్ రైల్వే నిలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

railway contract workers protest at railway bhavan
జీతాలు చెల్లించాలని కోరుతూ రైల్వే కాంట్రాక్టు కార్మికుల ధర్నా

By

Published : Jun 22, 2020, 3:01 PM IST

లాక్​డౌన్ సమయంలో పనులు జరగనప్పటికీ రైల్వేబోర్డు ఆదేశాల మేరకు జీతాలు చెల్లించాలని సీఐటీయూ హైదరాబాద్​ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు డిమాండ్ చేశారు. పెండింగ్​ జీతాలు చెల్లించాలని కోరుతూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైల్వే కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేశారు. రైల్వే యాజమాన్యం కూడా కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు చెల్లించారా.. లేదా అనే విషయాన్ని పట్టించుకోవాలన్నారు.

రెండు నెలలుగా జీతాలు లేక కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్​ వేతనాలు చెల్లించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:తెలంగాణకు కొత్తగా కేటాయించేది మూడు రైళ్లేనా ?

ABOUT THE AUTHOR

...view details