తెలంగాణ

telangana

ETV Bharat / state

చార్మినార్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాహుల్

Rahul Gandhi : దేశ సమైక్యత కోసం జోడో యాత్రను మొదలుపెట్టిన రాహుల్.. హైదరాబాద్‌లోని చార్మినార్‌ను సందర్శించారు. అక్కడే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. చార్మినార్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. చార్మినార్ వద్దకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు.

Rahul unfurled the national flag at Charminar
Rahul unfurled the national flag at Charminar

By

Published : Nov 1, 2022, 5:24 PM IST

Updated : Nov 1, 2022, 6:40 PM IST

Rahul Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. శంషాబాద్‌లోని మాతా టెంపుల్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన రాహుల్‌.... హైదరాబాద్‌లోకి ప్రవేశించారు. ఆరాంఘర్‌, బహదూర్‌పురా మీదుగా యాత్ర సాగించారు. సాయంత్రం చార్మినార్‌ను సందర్శించారు. రాజీవ్‌గాంధీ సద్భావన యాత్రను స్మరించుకుంటూ...చార్మినార్‌ వద్ద రాహుల్‌గాంధీ జాతీయ పతాకం ఎగురవేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

చార్మినార్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం పురానాపూల్‌ వంతెన మీదుగా యాత్ర కొనసాగించారు. రాహుల్‌గాంధీ వెంట కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. హైదరాబాద్‌లో భారత్‌ జోడో యాత్రకు వెయ్యి మంది పోలీసులతో పటిష్ఠ భద్రత కల్పించారు. యాత్ర జరిగే ప్రాంతాలల్లో వాహనాల దారి మళ్లించారు. రాత్రి బోయిన్‌పల్లిలోని గాంధీ భావజాల కేంద్రంలో రాహుల్ విశ్రాంతి తీసుకోనున్నారు. బుధవారం ఉదయం నుంచి మళ్లీ యాత్ర కొనసాగిస్తారు.

Last Updated : Nov 1, 2022, 6:40 PM IST

ABOUT THE AUTHOR

...view details