తనపై దాడి జరిగిందని రాహుల్ సిప్లిగంజ్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సరదాగా గడిపేందుకు పబ్‌కు వెళ్తే రాజకీయ అండతోనే తనపై దాడి చేశారని రాహుల్ వాపోయారు. తన స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్తించడం వల్లే వారిని నిలదీశానని... అందుకే దాడి చేశారని సిప్లిగంజ్ పేర్కొన్నారు. వారిని గతంలో ఎప్పుడూ చూడలేదని... వాళ్లతో ఎలాంటి పరిచయం లేదన్నారు బిగ్ బాస్-3 షో విజేత. తనపై బీరు సీసాలతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మాటామాటా పెరిగి...
పబ్‌లో లభించిన వీడియోల ఆధారంగా కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. రితేశ్ రెడ్డితో పాటు మరో ఆరుగురు దాడి చేశారని వెల్లడించారు. నృత్యం చేస్తున్న సమయంలో రాహుల్‌ను కొంతమంది తాకారని అన్నారు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి దాడి జరిగిందని సీఐ పేర్కొన్నారు. పబ్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని... ఇప్పుడు రాహుల్ అదే విషయంపై ఫిర్యాదు చేశారని తెలిపారు.
నాపై దాడి చేశారు... చర్యలు తీసుకోండి : రాహుల్ సిప్లిగంజ్ ఇవీ చూడండి : రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి.. తీవ్ర రక్తస్రావం