తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆహా.. ఏమి రుచి.. ఆ రుచికి మైమరిచిపోయాను: రాహుల్‌గాంధీ

Rahul says the Bamboo Chicken is Amazing: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్రంలో చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను పీసీసీ వీడియోరూపంలో పంచుకుంది. తన పాదయాత్రలో పాల్గొన్న కేరళ నాయకులు నడవలేక పడిపోయారని, తెలంగాణ నేతల్లో మాత్రం ఎవరికీ అలా కాలేదని రాహుల్‌ వ్యాఖ్యానించారు. సమష్టి కృషితో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. భద్రాచలం ఏజెన్సీ మహిళలతో కలిసి స్వయంగా బొంగులో చికెన్‌ వండిన రాహుల్‌.. అద్భుతంగా ఉందని కితాబిచ్చారు.

Rahul says the Bamboo Chicken is Amazing
Rahul says the Bamboo Chicken is Amazing

By

Published : Nov 13, 2022, 7:47 AM IST

ఆహా.. ఏమి రుచి.. ఆ రుచికి మైమరిచిపోయాను: రాహుల్‌గాంధీ

Rahul says the Bamboo Chicken is Amazing: రాష్ట్రంలో రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రను విజయవంతం చేసిన కాంగ్రెస్‌ నేతలు.. ఆ సమయంలో తమ పార్టీ అగ్రనేతతో గడపిన మధుర క్షణాలను వీడియోరూపంలో పంచుకున్నారు. రోజూ 25 కిలోమీటర్లు నడిచిన రాహుల్‌తో రాష్ట్ర నేతలూ పాదం కదిపారు. తొలిరోజు తాను నడవకపోయానని, ఆ తర్వాత కుదురుకుని.. ఎలాంటి ఇబ్బంది లేకుండా యాత్రలో భాగస్వామ్యం అయినట్లు కాంగ్రెస్‌ నేత వంశీచంద్‌రెడ్డి తెలిపారు.

భారత్‌ జోడో యాత్ర కోసం తాము కొంతనే జన సమీకరణ చేశామని, చాలా మంది తమను చూసేందుకు వచ్చారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. రాహుల్‌తో అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలో యాత్రను బాగా నిర్వహించారని జగ్గారెడ్డికి రాహుల్‌ కితాబిచ్చారు. 25 కిలో మీటర్ల పాదయాత్రలో ఎన్నో వర్గాలను కలిశారని, మేధావులతో చర్చించారని.. అవి ఎంతో ప్రభావం చూపినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనగా.. మరి కొన్ని కిలోమీటర్లు దూరం పెంచమంటారా అంటూ రాహుల్‌ చమత్కరించారు.

కేరళ నాయకులు తనతో నడవలేక పడిపోయారని, తెలంగాణ నేతల్లో ఎవరికి అలా కాలేదని రాహుల్‌ అన్నారు. తాను ఆర్​ఎస్​ఎస్​ నుంచి వచ్చానని, అక్కడ గాంధీ కుటుంబంపై విద్వేషాన్ని నూరి పోసేవారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాహుల్‌తో అన్నారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబంపై ఎందుకీ విమర్శలని తనలో పరివర్తన వచ్చిందని తెలిపారు. భద్రాచలంలోని గిరిజనులతో కలిసి రాహుల్‌గాంధీ.. స్వయంగా బొంగులో చికెన్‌ వండారు. బొంగులో చికెక్‌ను స్వయంగా గిరిజనులు, పార్టీ నేతలకు రాహుల్‌గాంధీ వడ్డించారు. ఆ రుచికి మైమరిచిపోయారు.


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details