ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా విస్తారంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ నేతలు, కార్యకర్తలు,శ్రేణులకు సూచించారు.
నేడు రాహుల్ గాంధీ జన్మదినం.. కార్యకర్తలకు ప్రత్యేక సూచనలు - పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి
నేడు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు తమ ప్రాంతాల్లో సేవా కార్యకమాలు నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు.
కొవిడ్ విధులు నిర్వహిస్తున్న వైద్యులు, పారిశుధ్య కార్మికులు, తదితరులను ఈ సందర్భంగా సన్మానించాలని కోరారు. ఎవరూ హంగూ, ఆర్భాటానికి వెళ్లకూడదని, ఏఐసీసీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులు తదితరులు తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కొవిడ్ నియమనిబంధనలకు లోబడే ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి :కరోనా కాలాన.. వృద్ధులకు 'ఆలన'!