Rahul Gandhi Virtual Meeting with Telangana Congress Leaders :కాంగ్రెస్‌కు సానుకూలంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ఫలితాలపై ఏఐసీసీ అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్(Congress Party) ముఖ్య నేతలతో రాహుల్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. రేపటి ఫలితాల దృష్ట్యా తాజా పరిణామాలపై చర్చించారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మధు యాష్కీ, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రేపే జడ్జిమెంట్ డే- ఎలక్షన్ కౌంటింగ్‌కు ఈసీ ఏర్పాట్లు పూర్తి
Telangana Election Results 2023 :కౌంటింగ్ కేంద్రాలు దాటి రావద్దని అభ్యర్థులకు ఏఐసీసీ ఆదేశించింది. పరిశీలకులు కూడా కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల వద్దనే ఉండాలని సూచించింది. పోటీలో నిలిచిన అభ్యర్థులను హైదరాబాద్ తాజ్ కృష్ణాకు రప్పించాలని ముందుగా భావించినా అనంతరం ప్రణాళిక మార్చుకున్నారు. అయితే రాత్రి 11.30 గంటలకు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆ రాష్ట్ర మంత్రులు జార్జ్ , బోసురాజు పలువురు ఏఐసీసీ కార్యదర్శులు హైదరాబాద్ చేరుకోనున్నారు.
"తెలంగాణలో సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. మా అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ట్రాప్ చేస్తున్నారనే సమాచారం మాకు అందింది. అటువంటి చర్యలను తిప్పికోడుతాం".- డీకే శివకుమార్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి
రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ పెట్టారేమో : ఉత్తమ్‌కుమార్ రెడ్డి
Telangana Congress Latest News :కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రలోభ పెట్టబోతున్నట్లు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు.రేపు కౌంటింగ్ జరగనున్న వేళ 49 కౌంటింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఏఐసీసీ ప్రత్యేక పరిశీలకులను వెంట ఉంచనున్నారు. మరోవైపు ముఖ్య ఎన్నికల ఏజంట్‌కు ఎమ్మెల్యే ధ్రువపత్రాలు తీసుకునేందుకు వెసులుబాటు ఇవ్వాలని ఈసీ వికాస్ రాజ్‌ను కాంగ్రెస్ నాయకులు కోరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్న వేళ తమ పార్టీ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రలోభపెట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత మల్లు రవి ఆరోపించారు. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ ప్రలోభపెట్టవచ్చని పేర్కొన్నారు. ముందుజాగ్రత్తగా తమ పార్టీ అభ్యర్థులకు కొన్ని సూచనలు చేసినట్లు తెలిపారు. పార్టీ పెద్దలు హైదరాబాద్‌లోనే ఉండి పరిస్థితి సమీక్షిస్తారని పేర్కొన్నారు.
"రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్న వేళ మా పార్టీ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రలోభపెట్టే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా మా పార్టీ అభ్యర్థులకు కొన్ని సూచనలు చేశాము. పార్టీ పెద్దలు హైదరాబాద్‌లోనే ఉండి పరిస్థితి సమీక్షిస్తారు". - మల్లు రవి, కాంగ్రెస్ సీనియర్ నేత
కాయ్ రాజా కాయ్ - కామారెడ్డి ఫలితంపై జోరుగా బెట్టింగ్‌లు