Rahul Gandhi Padayatra Route Map in Telangana: రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారైంది. 375 కిలోమీటర్ల మేర భారత్ జోడోయాత్ర సాగనుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. రాహుల్ పాదయాత్ర 23న కర్ణాటక నుంచి మక్తల్ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందన్నారు. దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, శంషాబాద్, ఆరాంఘర్, చార్మినార్, గాంధీభవన్, నెక్లెక్రోడ్, బోయిన్పల్లి, కూకట్పల్లి, మియాపూర్, పటాన్చెరు, ముత్తంగి, సంగారెడ్డి, జోగీపేట్, మద్దునూర్ వరకు సాగనుంది. యాత్ర సమన్వయం కోసం ఇంఛార్జులను నియమించామన్న రేవంత్‌రెడ్డి 31న జోడోయాత్ర హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తుందని తెలిపారు.
చార్మినార్ నుంచి నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు యాత్ర సాగనుందన్న రేవంత్.. అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమై.. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్‌పై సమీక్షించారు. సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్, ఎంపీ ఉత్తమ్, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో 375 కిలోమీటర్లు రాహుల్‌గాంధీ జోడోయాత్ర సాగనుంది. జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ వరకు జోడో యాత్ర కొనసాగుతుందని వివరించారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకులు కృషి చేయాలని కోరారు.