తెలంగాణ

telangana

ETV Bharat / state

అమరవీరుల స్మారకం నిర్మాణ పనులను పరిశీలించిన రాహుల్​గాంధీ - ts news

Rahul Gandhi Visit Martyrs Memorial: హైదరాబాద్ లుంబినీ పార్క్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న అమరవీరుల స్థూపాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సందర్శించారు. గాంధీభవన్ నుంచి నేరుగా అమర వీరుల స్థూపం వద్దకు కాంగ్రెస్ నేతలతో కలిసి వచ్చారు.

అమరవీరుల స్మారకం నిర్మాణ పనులను పరిశీలించిన రాహుల్​గాంధీ
అమరవీరుల స్మారకం నిర్మాణ పనులను పరిశీలించిన రాహుల్​గాంధీ

By

Published : May 7, 2022, 5:26 PM IST

Updated : May 7, 2022, 8:27 PM IST

Rahul Gandhi Visit Martyrs Memorial: హైదరాబాద్‌ లుంబినీ పార్క్‌ వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అమరవీరుల స్మారక స్తూపాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ పరిశీలించారు. అమరవీరుల స్థూపం పనుల గురించి మాణిక్కం ఠాకూర్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితర నాయకులను అడిగి తెలుసుకున్నారు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని రాహుల్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వివరించారు. ఎనిమిదేళ్లు కావస్తున్నా కేసీఆర్‌ సర్కార్‌ నిర్మాణం పూర్తిచేయడంపై దృష్టిసారించడం లేదని రాహుల్‌కు చెప్పారు. అమరుల త్యాగాలను గౌరవించుకోలేని దుస్థితిలో తెరాస సర్కార్‌ ఉందన్నారు. రాహుల్‌ వెంట కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఉన్నారు.

రాహుల్​ వెంట తరలివచ్చిన నేతలు

అనంతరం శంషాబాద్​ విమానాశ్రయం చేరుకుని.. అక్కడ నుంచి తిరిగి దిల్లీకి పయనమయ్యారు. రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించిన రాహుల్ గాంధీ ఈ సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు తిరిగి దిల్లీ వెళ్లిపోయారు. వరంగల్​లో రైతు సంఘర్షణ సభలో పాల్గొని కాంగ్రెస్ వ్యవసాయ విధానాన్ని ఆవిష్కరించిన రాహుల్ గాంధీ.. రెండోరోజు పలువురు ప్రజా నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం చంచల్​గూడ జైల్లో ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలను ములాఖత్​లో కలుసుకున్నారు. గాంధీభవన్​లో పార్టీ శ్రేణులతో సమావేశమైన రాహుల్ గాంధీ.. వచ్చే ఎన్నికల్లో టికెట్ల ఖరారుపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ట్యాంక్ బండ్​పై నిర్మిస్తున్న అమరవీరుల స్థూపాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క సహా పలువురు కాంగ్రెస్ నాయకులు వీడ్కోలు పలికారు.

ఇవీ చదవండి:

Last Updated : May 7, 2022, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details