Traffic Restrictions in Hyderabad Today : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేడు మాదాపూర్ డివిజన్‌లో జోడో యాత్ర కొనసాగుతోంది. పోలీసులు ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు రోజుల కిందట షాద్‌నగర్ వద్ద జోడో యాత్రలో చోటు చేసుకున్న ఘటన పునరావృతం కాకుండా పోలీసులు రాహుల్ గాంధీకి మరింత భద్రత పెంచారు. మరో వైపు యాత్ర కొనసాగే మార్గాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. వాహనదారులు విధిగా ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్‌రావు కోరారు.
Traffic Restrictions in Hyderabad Today : భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు - Traffic Restrictions in Hyderabad Today
Traffic Restrictions in Hyderabad Today : నేడు భారత్ జోడో యాత్ర సందర్భంగా భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జోడో యాత్ర కొనసాగుతోన్న అన్ని మార్గాల్లో ఆంక్షలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉండనున్నాయి. వాహనదారులు ఆంక్షలు పాటించి ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగిస్తూ సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
భారత్ జోడో యాత్ర ట్రాఫిక్ ఆంక్షలు
ఆంక్షలు అమల్లో ఉండనున్న ప్రాంతాలు:
- కూకట్‌పల్లి మీదగా బాలనగర్ వైపు వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి. వై జంక్షన్ ను మూసివేత యాత్ర ఐడిఎల్ చెరువు దాటిన తర్వాత వైజంక్షన్ మీదగా రాకపోకలు పునరుద్ధరణ.
- బాలానగర్, ఎర్రగడ్డ మీదగా వచ్చే వాహనాలను మూసాపేట్ చౌరస్తా మీదగా.. మూసాపేట్ జీహెచ్‌ఎంసీ కార్యాలయం, ఆంజనేయనగర్, రైన్‌బో విస్టా, కైత్లాపూర్ కూడలి, కేపీహెచ్‌బీ 4వ ఫేజ్ పైప్‌లైన్ రోడ్డు మీదగా మళ్లించనున్నారు.
- జోడో యాత్ర జేఎన్టీయూ కూడలి దాటిన తర్వాత బాలానగర్, కూకట్‌పల్లి మీదగా వచ్చే వాహనాలకు ఐడీఎల్ కూడలి మీదగా అనుమతించనున్నారు. ఆయా వాహనాలను జేఎన్టీయూ కూడలి మీదగా ఫోరం మాల్‌పై వంతెన మీదగా హిందు ప్రాజెక్టు పైప్ లైన్ రోడ్డు మీదగా బీహెచ్‌ఇఎల్‌కు పంపించనున్నారు.
- కూకట్‌పల్లి మీదగా నిజాంపేట్, ప్రగతినగర్‌కు వచ్చే వాహనాలను జేఎన్టీయూ కూడలి నుంచి కేపీహెచ్‌బీ 9వ ఫేజ్ మీదగా వసంత్‌నగర్, హైదర్‌నగర్ మీదగా దారి మళ్లించనున్నారు.
- చందానగర్ మీదగా మూసాపేట్‌కు వచ్చే వాహనాలకు పైపు లైన్ రోడ్డు మీదగా అనుమతి లేదు. మూసాపేట్ మీదగా చందానగర్‌కు చేరుకునేందుకు ఒక వైపు రాకపోకలకు మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు.
- కొండాపూర్ మీదగా బీహెచ్‌ఇఎల్‌కు.. ఆల్విన్ కూడలి మీదగా వెళ్లే వాహనాలను సాయిరాం టవర్స్, హఫీజ్పేట్పై వంతెన కింది నుంచి పైప్‌లైన్ రోడ్డు మీదగా అనుమతిచ్చారు.
- కొండాపూర్ మీదగా మూసాపేట్‌కు పైపులైన్ రోడ్డు మీదగా వెళ్లే వాహనాలను సాయిరాం టవర్స్, హఫీజ్‌పేట్ పై వంతెన, ఆర్టీఓ కార్యాలయం, హిందూ ప్రాజెక్టు, కైత్లాపూర్ కూడలి మీదగా మూసాపేట్‌కు అనుమతించారు.
- బీహెచ్‌ఇఎల్ కూడలి మీదగా పటాన్చెరువు జాతీయ రహదారి 65 మీదగా వెళ్లే వాహనాలను అనుమతించరు. అవతలి వైపు నుంచి వాహనాలకు అనుమతిచ్చారు.
ఇవీ చదవండి: