ఆర్టీసీ సమ్మె 35వ రోజుకు చేరింది. హయత్‌నగర్‌లోని గార్డెన్లో భాజపా నేత కె.రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, బిజెపి పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు పాల్గొన్నారు. రేపు ట్యాంక్‌బండ్‌పై నిర్వహించనున్న మిలియన్‌మార్చ్‌ను జయప్రదం చేయాలని వారు కోరారు.
"నిర్బంధాలు, నియంతృత్వాలు మిలియన్ మార్చ్‌ను ఆపలేవు" - TSRTC STRIKE IN HYDERABAD
ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడినా, అక్రమ అరెస్టులు చేసినా మిలియన్ మార్చ్‌ను ఆపలేరని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, బిజెపి పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు తెలిపారు.
RAGHUVARDHAN REDDY SUPPORT TO CHALO TANK BUND PART OF TSRTC STRIKE
నిర్బంధాలు, నియంతృత్వాలు మిలియన్ మార్చ్‌ను ఆపలేవని చెప్పారు. రాత్రికిరాత్రే ట్యాంక్‌బండ్‌కు చేరుకోవాలని సూచించారు. కేసీఆర్ తీరుతో ఐఏఎస్ అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. ఇది ప్రభుత్వానికే సిగ్గుచేటని తెలిపారు. హుజూర్‌నగర్‌లో తెరాసను పడగొడితే.. ఇప్పటికల్లా ఆర్టీసీ సమ్మె ఫలప్రదమయ్యేదని అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: భార్య అసహజ కోరికలు.. తీశాయి భర్త ప్రాణాలు!