తెలంగాణ

telangana

గ్రామాల్లోని కిరాణ దుకాణాలు మద్యం షాపులుగా మారిపోయాయి: రఘునందన్‌

By

Published : Feb 9, 2023, 6:42 PM IST

Updated : Feb 9, 2023, 7:15 PM IST

Telangana Budget Sessions 2023-24 : బడుగు బలహీన వర్గాలకు నిధులు సరిగ్గా ఖర్చు పెట్టడం లేదని ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. బీసీలకు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలని తెలిపారు. బీసీలకు ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారో లెక్కలు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు.

Raghunandan Rao
Raghunandan Rao

Telangana Budget Sessions 2023-24 : ప్రతి గ్రామంలోని కిరాణ దుకాణాలు మద్యం షాపులుగా మారిపోయాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి మద్యం కాకుండా మరో మార్గం చూసుకోవాలని సూచించారు. దివ్యాంగుల కోసం క్యాంపు పెట్టి ఈవీలు ఉచితంగా ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలోనే బడుగు బలహీన వర్గాలకు నిధులు సరిగ్గా ఖర్చు పెట్టడం లేదని ఆరోపించిన ఆయన.. బీసీలకు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలని అన్నారు. బీసీలకు ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారో లెక్కలు చూపించాలని రఘునందన్‌ రావు డిమాండ్ చేశారు.

"ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి మద్యం కాకుండా మరో మార్గం చూసుకోవాలి. ప్రతి గ్రామంలోని కిరాణ దుకాణాలు మద్యం షాపులుగా మారిపోయాయి. దివ్వాంగుల కోసం క్యాంపు పెట్టి ఈవీలు ఉచితంగా ఇవ్వాలి. బడుగు బలహీన వర్గాలకు నిధులు సరిగ్గా ఖర్చు పెట్టడం లేదు. బీసీలకు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలి. బీసీలకు ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారో లెక్కలు చూపించాలి."- రఘునందన్‌ రావు, బీజేపీ ఎమ్మెల్యే

ధరణి పోర్టల్​పై వాడీవేడి చర్చ..: మరోవైపు ధరణి పోర్టల్​పై అసెంబ్లీ సమావేశాల్లో వాడీవేడి చర్చ సాగింది. ధరణి పోర్టల్‌ రైతులకు శాపంగా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు ఆరోపించారు. ధరణిలో లోపాలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం బీసీ సంక్షేమానికి రూ.6,000 కోట్లు ఖర్చు పెడతామని అన్నారని గుర్తు చేశారు. ఫెడరేషన్ ఏర్పాటు చేశారు కానీ.. ఒక్క రూపాయీ ఇవ్వలేదని ఆరోపించారు. ఫెడరేషన్ బలోపేతం కోసం నిధులు మంజూరు చేయాలని శ్రీధర్‌ బాబు కోరారు.

ఆరోపణలను నిరూపించగలరా..? శ్రీధర్‌ బాబు ఆరోపణలను మంత్రి కేటీఆర్‌ ఖండించారు. ధరణి పోర్టల్‌పై.. మీరు చేస్తున్న ఆరోపణలు నిరూపించగలరా అని ప్రశ్నించారు. సత్య దూరమైన మాటలు మాట్లాడవద్దని సూచించారు. మీరు చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే క్షమాపణ చెబుతారా? అని అన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సమంజసమా? అని ప్రశ్నించారు. చిన్న లోపాలను పట్టుకుని బూతద్దంలో చూపిస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు.

గ్రామాల్లోని కిరాణ దుకాణాలు మద్యం షాపులుగా మారిపోయాయి: రఘునందన్‌

ఇవీ చదవండి:ఉద్యమం చేసైనా సింగరేణిని కాపాడుకుంటాం.. అసెంబ్లీలో కేటీఆర్‌

ధరణిపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ.. శ్రీధర్‌ బాబు వర్సెస్ కేటీఆర్

'దేశాభివృద్ధికి కాంగ్రెస్సే అడ్డంకి'.. రాజ్యసభలో మోదీ ఫైర్​

Last Updated : Feb 9, 2023, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details