రాష్ట్రం నుంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు(Raghunandan rao fires on KTR) వెల్లడించారు. హైదరాబాద్‌లో భూరికార్డుల నిర్వహణ సరిగ్గా లేదని, అందుకే తమ పెట్టుబడులను వేరే రాష్ట్రాలకు తరలించుకు వెళ్తున్నామని కంపెనీలు చెప్పాయని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద టెక్నో సిటీ కడతామని టిష్‌మాన్ స్పెయర్ కంపెనీ ముందుకు వస్తే ప్రభుత్వం సహకరించలేదని రఘునందన్‌రావు విమర్శించారు. 2007లో తెల్లాపూర్‌లో 400 ఎకరాలను బహిరంగ వేలంలో కొనుగోలు చేసిందన్నారు. టిష్‌మాన్ స్పెయర్ కంపెనీ రూ.400 కోట్లు అడ్వాన్స్ చెల్లించిందని... 14 ఏళ్లు గడిచినా భూ సమస్యను పరిష్కరించకపోవడంతో రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయిందని తెలిపారు. 2014 జూన్ 2 తర్వాత తెరాస సర్కారు ఒప్పందం చేసుకున్న కంపెనీల పేర్లను మంత్రి కేటీఆర్ చెప్పాలని రఘునందన్‌రావు(Raghunandan rao fires on KTR) డిమాండ్ చేశారు.
చర్చకు సిద్ధమా?
తెలంగాణలో ఐటీరంగం అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ అబద్ధాలు చెప్పారని రఘునందన్‌రావు(Raghunandan rao fires on KTR) ఆరోపించారు. 2014కు ముందే వేవ్‌రాక్ నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు. వేవ్‌రాక్ ప్రాంరభం రోజే సంస్థ యాజమాని స్పెయిర్... సీఎం కేసీఆర్‌కు(CM KCR) తెల్లపూర్ భూమికి సంబంధించి దరఖాస్తు ఇచ్చారని వెల్లడించారు. వేవ్‌రాక్‌ను తెరాస తన ఖాతాలో వేసుకుందని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెప్పిన ఐటీ మంత్రి కేటీఆర్(Minister ktr)... చర్చకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం సహకరించలేదు
టెక్నోసిటీ నిర్మిస్తామన్న టిస్మాన్ స్పెయిర్‌కు ప్రభుత్వం సహకరించలేదని రఘునందన్ ఆరోపించారు. టిస్మాన్ స్పెయిర్ ఇక్కడ వ్యాపారం చేయలేమని వెళ్లిపోయారని తెలిపారు. ఆ కంపెనీ వెనక్కి పోవడానికి కారణం కేసీఆర్, కేటీఆర్ కాదా? ప్రశ్నించారు. అనేక కంపెనీలు హైదరాబాద్‌ను వదిలి వెళ్లాయని అన్నారు. తెరాస సర్కారు ఒప్పందం చేసుకున్న కంపెనీల పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కొబ్బరికాయ కొట్టిన బోయింగ్‌ను తెరాస సర్కార్ తన ఖాతాలో వేసుకుందని ఆరోపించారు. 2011లో ఉప్పల్‌లో ఏర్పాటు చేసిన ఐటీ పార్కును కేటీఆర్ ఒక్కసారి కూడా ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు.