తెలంగాణ

telangana

ETV Bharat / state

రఘురామకృష్ణరాజు జైలుకెళ్లడం ఖాయం: నందిగం సురేశ్‌ - Nandigam Suresh comments on RaghuRama

ఆంధ్రప్రదేశ్​ ఎంపీ రఘురామకృష్ణరాజుపై... ఎంపీ నందిగం సురేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన జైలుకెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ రద్దు చేయాలన్న రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను సాయంత్రానికే కొట్టేశారని వివరించారు.

raghu-rama-krishnaraja-imprisonment-confirmed-nandigam-suresh
raghu-rama-krishnaraja-imprisonment-confirmed-nandigam-suresh

By

Published : Apr 7, 2021, 6:25 PM IST

ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామకృష్ణరాజు కచ్చితంగా జైలుకెళ్లడం ఖాయమని.. వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌ వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణరాజుపైనా సీబీఐ కేసులు ఉన్నాయని వివరించారు. జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ రద్దు చేయాలని రఘురామ పిటిషన్‌ వేశారన్న ఎంపీ నందిగం.. రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను సాయంత్రానికే కొట్టేశారని వెల్లడించారు. జగన్‌ రాముడితో సమానం కాబట్టే ప్రజలు ఎన్నికల్లో గెలిపించారని నందిగం సురేశ్ స్పష్టం చేశారు.

రఘురామకృష్ణరాజు జైలుకెళ్లడం ఖాయం: నందిగం సురేశ్‌

బెయిల్ షరతులను ఉల్లంఘించిన ముఖ్యమంత్రి జగన్​ను జైలుకు పంపించి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ వేగంగా జరపాలని రఘురామకృష్ణరాజు పిటిషన్​ వేశారు.

ఇదీ చదవండీ..సీఎం జగన్ బెయిల్ రద్దు చేయండి.. సీబీఐ కోర్టులో పిటిషన్

ABOUT THE AUTHOR

...view details