తనను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, ఆయన బంధుమిత్రులు, సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఒకే సమయంలో అక్షరం పొల్లు పోకుండా ఫిర్యాదులు చేశారని వివరించారు.
నన్ను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టేందుకు కుట్ర: ఎంపీ రఘురామరాజు - తెలంగాణ వార్తలు
ఏపీ సీఎం జగన్, ఆయన బంధుమిత్రులు, సజ్జల రామకృష్ణారెడ్డిపై నరసాపురం ఎంపీ రఘురామరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. తనను అరెస్టుచేసి ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి విషయం తెలియజేస్తానని వెల్లడించారు.
నన్ను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టేందుకు కుట్ర: ఎంపీ రఘురామరాజు
కేంద్ర హోంశాఖ కార్యదర్శికి విషయం తెలియజేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా విచారణ జరపాలని కోరుతానని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం నుంచి నివేదిక కోరడం తగదని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.