ఆంధ్రాలో లిక్కర్ బ్రాండ్లు విచిత్రంగా ఉన్నాయని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తెలంగాణలో దొరికే మద్యం రోజూ తాగితే 20 ఏళ్లకు లివర్ పాడవుతుందని నిపుణులు అంటున్నారని రఘురామకృష్ణరాజు అన్నారు. ఆంధ్రాలో దొరికే మద్యం తాగినవారు 2, 3 ఏళ్లకే హరీ అంటారని నిపుణులంటున్నారని పేర్కొన్నారు.
'ఆంధ్రా మద్యం తాగితే 2, 3 ఏళ్లకే హరీ అంటారు' - మద్యంపై రఘురామ కృష్ణరాజు
ఆంధ్రప్రదేశ్లో మద్యం బ్రాండ్లపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో దొరికే మద్యం తాగినవారు 2, 3 ఏళ్లకే చనిపోయే అవకాశముందని నిపుణులంటున్నారని రాఘురామ కృష్ణరాజు అన్నారు.
raghu-rama-krishna-raju-on-liqour-brands-in-andhra-pradesh
లీజుకు ఎవరు తీసుకున్నారోగానీ ఎస్పీవై రెడ్డి కర్మాగారంలో మద్యం బ్రాండ్లు తయారుచేస్తున్నారని రఘురామ కృష్ణరాజు అన్నారు. పలు రకాల మోడళ్లలో మద్యం బ్రాండ్లన్నీ ఒకేచోట తయారుచేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: మూడు రాజధానుల కేసులపై ఇకపై రోజువారీ విచారణ!