జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌శాతం పెరిగేలా రేడియో సంస్థలు ప్రధాన పాత్ర పోషించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కోరారు. గత ఎన్నికల్లో 50 శాతం కూడా మించలేదని ఆయన తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో పలు రేడియో కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
పోలింగ్ శాతం పెరిగేలా ఓటర్లను చైతన్యం చేయండి : పార్థసారథి - హైదరాబాద్ వార్తలు
గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు రేడియో సంస్థలు ఓటర్లను చైతన్య పరచాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కోరారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఆల్ ఇండియా రేడియో, నగరంలోని ఎఫ్ఎమ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
పోలింగ్ శాతం పెరిగేలా ఓటర్లను చైతన్యం చేయండి : పార్థసారథి
గ్రేటర్ పరిధిలో విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు అధికంగా ఓటింగ్‌లో పాల్గొనేలా చైతన్యపరచాలని సూచించారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో చేపడుతున్న చర్యలపై ప్రసార మాధ్యమాలు అవగాహన కల్పించాలన్నారు. ఒక్కరోజు ఓటు వేయండి..ఐదేళ్లు సౌఖ్యంగా ఉండండి అంటూ ఓటర్లను చైతన్యపరచాలని పార్థసారథి పేర్కొన్నారు.