హైదరాబాద్ వనస్థలిపురంలోని స్టార్ మార్కెట్‌లో జాతి వివక్ష చూపించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వ్యక్తి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. విదేశీయులను పోలి ఉన్న ఇద్దరు మణిపూర్ వాసులను నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. తమ ఆధార్‌కార్డు చూపించినా సెక్యూరిటీ గార్డు పట్టించుకోనందున జోనా అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు పోస్ట్ చేశారు.
చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి..
జాతి వివక్ష చూపిన స్టార్ మార్కెట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతూ కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఇలాంటి చర్యలు మున్ముందు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకునేలా కమిషనర్లు, ఎస్పీలకు సూచించాలని మంత్రి పేర్కొన్నారు.