తెలంగాణ

telangana

ETV Bharat / state

Rachakonda Police Instructions to HCA Representatives : 'వార్మప్‌ మ్యాచ్‌కు ప్రేక్షకులను వద్దు..' హెచ్​సీఏకు పోలీసుల సూచన - HCAకి రాచకొండ పోలీసుల సూచనలు

Rachakonda Police Instructions to HCA Representatives : ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 29న జరిగే ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్​పై రాచకొండ పోలీసులు కొన్ని ప్రతిపాదనలు సూచించారు. ప్రేక్షకులను లోపలికి అనుమతించకుండా కేవలం ఆటగాళ్లతోనే మ్యాచ్ నిర్వహించాలని పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రతిపాదనను హెచ్‌సీఏ ప్రతినిధులు పరిగణలోకి తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ దృష్టికి కూడా తీసుకెళ్లారు.

Rachakonda Police Instructions to HCA Representatives
Rachakonda Police

By ETV Bharat Telangana Team

Published : Sep 21, 2023, 8:15 PM IST

Rachakonda Police Instructions to HCA Representatives :ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 29వ తేదీన జరిగే ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్​పై రాచకొండ పోలీసులు కొన్ని ప్రతిపాదనలు సూచించారు. ప్రేక్షకులు లేకుండా కేవలం ఇరుదేశాల ఆటగాళ్లతోనే సన్నాహక మ్యాచ్ నిర్వహించాలని హెచ్‌సీఏ(Hyderabad Cricket Association)కు పోలీసులు తెలిపారు. హైదరాబాద్​లో ఈ నెల 28, 29 తేదీల్లో గణేశ్ నిమజ్జనం(Ganesh Immersion)తో పాటు వచ్చే నెల 1వ తేదీన మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉంది. 28వ తేదీ ఉదయం నుంచి 29వ తేదీ సాయంత్రం వరకు పోలీసులందరూ దాదాపు రహదారులపైనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

Police Said Spectators not Allowed Warm up Matches Uppal Stadium : ఈ తరుణంలో 29న పాక్-న్యూజిలాండ్ మధ్య జరిగే సన్నాహక మ్యాచ్​కు సంబంధించి మైదానంలో భద్రత విషయంలో పోలీసులు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ప్రేక్షకులను లోపలికి అనుమతించకుండా కేవలం ఆటగాళ్లతోనే మ్యాచ్ నిర్వహించాలని పోలీసులు సూచించారు. అయితే సన్నాహక మ్యాచ్​కు గాను నిర్వాహకులు ఇప్పటికే 1500 టికెట్లను విక్రయించారు. పోలీసుల ప్రతిపాదనను హెచ్‌సీఏ ప్రతినిధులు పరిగణలోకి తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ(Board of Control for Cricket in India) దృష్టికి కూడా తీసుకెళ్లారు. బీసీసీఐ అంగీకరిస్తే టికెట్లు కొనుగోలు చేసిన వాళ్లకు తిరిగి డబ్బులు ఇచ్చేయనున్నారు. వచ్చే నెల 3న జరిగే సన్నాహక మ్యాచ్​ను యథావిధిగా నిర్వహించుకోవచ్చని పోలీసులు నిర్వాహకులకు సూచించారు.

World Cup Trophy in Ramoji Film City : రామోజీ ఫిల్మ్ సిటీలో వరల్డ్ కప్ ట్రోఫీ.. ప్రపంచాన్ని చుట్టేసి హైదరాబాద్​కు..

Cricket World Cup Trophy 2023 :క్రికెట్‌ ప్రపంచకప్‌ ట్రోఫీ(World Cup Trophy) హైదరాబాద్‌ నగరానికి చేరుకుంది. ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ స్టేడియంలో ట్రోఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ట్రోఫీని ఉప్పల్‌ స్టేడియంలో ఆవిష్కరించడంతో క్రికెట్‌ అభిమానులు(Cricket Fans) తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ట్రోఫీతో సెల్ఫీ, ఫోటోలు దిగుతూ సందడి చేశారు. ఉప్పల్‌ స్టేడియం ప్రపంచకప్‌కు ముస్తాబవుతున్నట్లు రిటైర్డ్‌ ఐపీఎస్‌ దుర్గా ప్రసాద్‌ తెలిపారు. స్టేడియంలో జరిగే మ్యాచ్​ల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. దాదాపు 10 వేల కొత్త కుర్చీలు వేసినట్లు పేర్కొన్నారు. క్రికెట్ అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామన్నారు. వామప్ మ్యాచ్​లకు క్రికెట్ అభిమానుల అనుమతిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

World Cup Trophy in Ramoji Film City : మరోవైపు ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్​కు భారత్ సిద్ధమౌతోంది. ఈ క్రమంలో భాగంగా ఐసీసీ.. వరల్డ్ కప్పును వివిధ దేశాల్లోని ప్రముఖ ప్రాంతాలకు తీసుకెళ్తోంది. తాజాగా బుధవారం రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకొచ్చింది. ఫిల్మ్​ సిటీలోని క్యారమ్ గార్డెన్​లో దీన్ని ప్రదర్శనకు ఉంచారు.

ఉప్పల్​లో ఆఖరి మ్యాచ్​.. భారీగా తరలివచ్చిన ప్రేక్షకులు.. టికెట్లు ఉన్నా సీట్లు లేక అవస్థలు

ICC Cricket World Cup 2023 Trophy at Ramoji Film City : రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రపంచకప్‌.. ఔరా అనిపిస్తున్న ఫొటోలు

ABOUT THE AUTHOR

...view details