ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

'సోమవారం నుంచే వారికి కొవిడ్ వ్యాక్సిన్​' - telangana police mega health camp in lb nagar

ఎల్బీనగర్ పరిధిలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మెగా ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఇది హైదరాబాద్​లో రెండో మెడికల్​ క్యాంపు అని తెలిపిన ఆయన.. దశలవారీగా అన్ని పోలీస్ స్టేషన్​ల పరిధిలోని సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Rachakonda Police Commissioner Mahesh Bhagwat inaugurated a mega health camp in lb.nagar
'సోమవారం నుంచే వారికి కొవిడ్ వ్యాక్సిన్​'
author img

By

Published : Feb 4, 2021, 2:28 PM IST

సోమవారం నుంచి రాచకొండ కమిషనరేట్​ పరిధిలో ఉన్న 12 వేల పోలీస్ సిబ్బందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.

మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో..

ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్​రోడ్​లోని.. కేకే గార్డెన్​లో పోలీస్ మెగా ఆరోగ్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్యాంపులో ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

మూడో క్యాంపు అక్కడే..

రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇది రెండో క్యాంపు అని తెలిపారు. మొదటిది మల్కాజిగిరి లో ఏర్పాటు చేశామని, త్వరలో యాదాద్రిలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కమిషనరేట్ పరిధిలో ఉన్న 12 వేల పోలీస్ సిబ్బందికి సోమవారం నుంచి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపిన సీపీ.. ఎవరికైనా ఇతర వ్యాధులు ఉంటే డాక్టర్ సలహా తీసుకుని వాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:క్యాన్సర్​ను ఆదిలోనే గుర్తిస్తే.. అంతం చేయొచ్చు: బాలకృష్ణ

ABOUT THE AUTHOR

...view details