రాచకొండ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ అమలును సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. చెక్‌పోస్టుల వద్ద సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
లాక్డౌన్ అమలును పరిశీలించిన రాచకొండ సీపీ - సీపీ మహేశ్ భగవత్ వార్తలు
లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని రాచకొండ పోలీసులు తెలిపారు. మీర్ పేట్, బాలాపూర్ ఠాణా పరిధిలోని పలు చెక్‌పోస్టులను సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు.
రాచకొండ సీపీ
రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి విస్తరిస్తూనే ఉందని.. ఉదయం పది గంటలలోపు ఉన్న సడలింపు సమయంలోనే పనులు ముగించుకుని వెళ్లిపోవాలని సీపీ సూచించారు. ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సహకరించాలని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:కాళ్లకు బొబ్బలెక్కినా.. నడక ఆగదు..