బల్దియా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ పాఠశాలలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని సీపీ పరిశీలించారు. కమిషనరేట్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
'బల్దియా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు' - రాచకొండ సీపీ వార్తలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. కమిషనరేట్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
'బల్దియా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు'
సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. గుర్తింపు కార్డు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పిన సీపీ... ప్రతి ఒక్కరు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని మహేశ్ భగవత్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి :ఓటుపై సినీ ప్రముఖులు ఏమన్నారంటే!