వలస కూలీల సమస్యలను తీర్చిన రాచకొండ సీపీ - Rachakonda cp solve the igrant workers problems
లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీల సమస్యలు తీర్చేందుకు రాచకొండ పోలీసులు మరిన్ని చర్యలు చేపట్టారు. టాటా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ టిస్ ఆధ్వర్యంలో సామాజిక ఆర్ధిక సర్వే నిర్వహించారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్, నేరేడ్ మెట్, ఎల్బీనగర్, వనస్థలీపురం, మీర్ పేట్ ప్రాంతాల్లో ఉన్న 5500 మంది వలస కూలీలకు సంబంధించి సర్వేను నిర్వహించారు. సర్వేలో వారికి అందే నిత్యావసర వస్తువులు, ఆరోగ్య సమస్యలపై ఆయా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ అధికారులతో సంప్రదింపులు జరిపి వారికి వివరాలు అందిచారు. ఈ సర్వేలో వలస కూలీల్లో ఉన్న చిన్నారులు, గర్భిణీ మహిళలకు వైద్య సేవలు అవసరం అని నివేదించారు. స్పందించిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని మెడికల్ వాలంటీర్లను కోరారు. వైద్యులు వారికి వైద్య పరిక్షలు నిర్వహించారు. తమ సమస్యలు తీర్చిన సీపీ మహేశ్ భగవత్ కు కూలీలు ధన్యవాదాలు తెలిపారు. వారికి వైద్య సేవలు అందిచిన డాక్టర్లను సీపీ అభినందించారు
TAGGED:
Rachakonda cp latest news