మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఈనెల 12న రాచకొండ పరిధిలో శివారెడ్డి అనే యువకుడు రోడ్డుపై వెళ్తున్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. గమనించిన రవి అనే న్యాయవాది పోలీసులకు సమాచారం అందించారు. అదే విషయాన్ని కమిషనర్ మహేశ్ భగవత్‌కు వాట్సాప్ ద్వారా తెలియజేశాడు. సీపీ ఆదేశాలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సమాచారమిచ్చిన రవిని సన్మానించారు.
మహిళల భద్రతపై రాజీపడేది లేదు: సీపీ మహేశ్ భగవత్ - మహేశ్ భగవత్
మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ అన్నారు.
మహిళల భద్రతపై రాజీపడేది లేదు: సీపీ మహేశ్ భగవత్