కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. మొత్తం ఐదుగురు ఉన్న ఈ ముఠాలో ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పట్నానికి చెందిన వారుగా గుర్తించారు.
నిందితులు అరకులో సరుకు కొని హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు సీపీ తెలిపారు. వీరి నుంచి 108 కేజీల గంజాయితో పాటు కారు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు.
అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా అరెస్ట్ - rachakonda cp mahesh bhagwath
గంజాయి తరలిస్తున్న నిందితులను అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. వారి నుంచి 108 కేజీల గంజాయితో పాటు ఒక కారు, 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
![అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా అరెస్ట్ rachakonda cp mahesh bhagwath on ganjai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5882004-thumbnail-3x2-cp.jpg)
అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా అరెస్ట్
అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా అరెస్ట్