రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు... వాటి పరిష్కారాల కోసం హైదరాబాద్ మల్లాపూర్‌లో నోమ ఫంక్షన్ హాల్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హాజరయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాచకొండ పరిధిలో 427 మంది మహిళా సిబ్బంది ఉన్నారని తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేశామన్నారు.
మహిళా పోలీస్ సిబ్బంది సమస్యలపై సీపీ సమావేశం - మహిళా పోలీస్ సిబ్బంది సమస్యలపై సీపీ మహేస్ భగవత్ సమావేశం
మహిళా పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై మల్లాపూర్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హాజరయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
మహిళా పోలీస్ సిబ్బంది సమస్యలపై సీపీ సమావేశం
సేఫ్ సిటీలో భాగంగా వచ్చే నిధులతో మహిళా సిబ్బంది కోసం అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.
ఇదీ చదవండి:లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన సీఐ