రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు. నేరెడ్ మెట్‌లోని రాచకొండ కమిషనరేట్ ప్రాంగణంలో మొక్క నాటి ఎంపీ సంతోష్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించారు. మేడిపల్లి, యాదాద్రిలో ఉన్న రాచకొండ కమిషనరేట్ భూముల్లో రాబోయే రెండు నెలల్లో 20వేల మొక్కలు నాటనున్నట్లు సీపీ ట్విట్టర్లో పేర్కొన్నారు. సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని మహేశ్ భగవత్ అభినందించారు. పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు పెంచడం ఎంతో అవసరమని అన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన రాచకొండ సీపీ - telangana news
ఎంపీ సంతోష్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్వీకరించారు. తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు పెంచడం ఎంతో అవసరమని అన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన రాచకొండ సీపీ