క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ అన్నారు. మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని ఆయన సూచించారు. యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తొలి దశలో క్యాన్సర్ గుర్తిస్తే చికిత్స సులభతరం: మహేశ్ భగవత్ - తెలంగాణ వార్తలు
రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో క్యాన్సర్‌పై మహిళా పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించారు. మారుతున్న పరిస్థితులను బట్టి జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని సీపీ మహేశ్ భగవత్ సూచించారు. క్యాన్సర్ గురించి వైద్యులు వివరించారు.
తొలి దశలో క్యాన్సర్ గుర్తిస్తే చికిత్స సులభతరం: సీపీ
రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో పనిచేసే మహిళా సిబ్బంది కోసం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు త్వరలో నిర్వహించనున్నట్లు సీపీ తెలిపారు. మహిళల్లో ఎక్కువగా కనిపించే పలు రకాల క్యాన్సర్, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యుడు రాజేష్ బొల్లం వివరించారు.
ఇదీ చదవండి:తెలంగాణలో రాజన్న రాజ్యం మళ్లీ తీసుకొస్తా: వైఎస్ షర్మిల