సీసీ కెమెరాల ఏర్పాటుతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషరేట్ల పరిధిలో నేరాల సంఖ్య తగ్గిందని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైశాలినగర్‌లో... కాలనీవాసుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఐదు లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన... 42 సీసీ కెమెరాలను సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు.
భవిష్యత్‌లో 3 కమిషనరేట్ల సీసీ కెమెరాల అనుసంధానం: సీపీ - Rachakonda CP who launched CCTV cameras
హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైశాలినగర్‌లో 42సీసీ కెమెరాలను సీపీ మహేశ్‌భగవత్ ప్రారంభించారు. కాలనీవాసుల సంక్షేమసంఘం ఆధ్వర్యంలో రూ. 5లక్షలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో మూడు కమిషనరేట్ల పరిధిలోసీసీ కెమెరాల అనుసంధానమవుతాయని సీపీ పేర్కొన్నారు.
భవిష్యత్‌లో 3 కమిషనరేట్ల సీసీ కెమెరాల అనుసంధానం: రాచకొండ సీపీ
భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ కమాండ్ కంట్రోల్ కంట్రోలింగ్‌కు ఈ మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాలన్ని అనుసంధానమవుతాయని సీపీ వెల్లడించారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్ల పరిధిలో ఆరున్నర లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు అయ్యాయని వాటిని 10 లక్షలకు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, మాజీ ఎంపీ మంద జగన్నాథం ఎల్బీనగర్ డీసీపీ, ఏసీపీలు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి:వరంగల్ నగర అభివృద్ధిపై కేటీఆర్ సమీక్ష