Rachakonda CP Mahish Bhagwat at Sararnagar Ground: దేహదారుడ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్దులు.. ఫలితాలు అనుకూలంగా వచ్చేలా చేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసేవారిని నమ్మవద్దని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు. సరూర్‌నగర్ అవుట్ డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన దేహదారుఢ్య పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వీటికి సంబంధించి అన్ని ఏర్పాట్లపై అధికారులను ఆరా తీశారు.
దేహదారుఢ్య పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన రాచకొండ సీపీ.. - సరూర్‌నగర్ గ్రౌండ్‌లో రాచకొండ సీపీ మహిష్ భగవత్
Rachakonda CP Mahish Bhagwat at Sararnagar Ground: హైదరాబాద్లోని సరూర్‌నగర్ అవుట్ డోర్ స్టేడయంలో ఏర్పాటు చేసిన దేహదారుఢ్య పరీక్షా కేంద్రాన్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. దేహదారుడ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్దులకి, ఫలితాలు అనుకూలంగా వచ్చేలా చేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసేవారిని నమ్మవద్దని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు వీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లపై అధికారులను ఆరా తీశారు.
Rachakonda CP Mahish Bhagwat
పరీక్షలు అన్ని పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తప్పుడు దారిలో వెళ్లేందుకు అవకాశమే లేదన్నారు. అభ్యర్ధులను మభ్యపెట్టి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఈ నెల 8 నుంచి ప్రిలిమినరీ పరీక్ష రాసి ఈవెంట్స్ కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్దులకు రాష్ట్ర వ్యాప్తంగా 12 మైదానాల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి: