పోలీసు శాఖ పనితీరు పటిష్టం కావడంలో మహిళా పోలీసుల కృషి ఎంతో ఉందని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. మహిళా పోలీసులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆయన... కేట్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉప్పల్లోని ఏషియన్ సినిమా థియేటర్లో ఓ సినిమాను చూశారు. కరుడుగట్టిన రేపిస్టును పట్టుకునే ఓ మహిళా పోలీసు అధికారిణి ఇతివృత్తంతో రూపొందించిన 'మర్ధాని2' సినిమాను 190 మంది మహిళా పోలీసులతో కలిసి తిలకించారు.
సీపీ మహిళా పోలీసులతో కలిసి ఏ సినిమా చూశారో తెలుసా? - mahesh bhagawath
నూతన సంవత్సర వేడుకల్లో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మహిళా పోలీసులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం 190 మంది మహిళా పోలీసులతో ఉప్పల్లోని ఏషియన్ థియేటర్లో 'మర్దాని2' చిత్రాన్ని తిలకించారు.
'మర్దాని2' చిత్రాన్ని తిలకించిన రాచకొండ సీపీ
గోపి పుర్దాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ... ఎస్పీ శివాని పాత్రలో నటించారు. ఓ మహిళా పోలీసు అధికారిణి ధైర్య సాహసాలతో నేరస్తుడిని అరెస్ట్ చేసిన తీరును ఈ సినిమాలో వివరించారు. సీపీతో కలిసి సినిమాను తిలకించిన మహిళా పోలీసులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ