'నిశ్శబ్ధంగా బాధపడకండి.. మమ్మల్ని సంప్రదించండి' అని.. రాచకొండ భద్రతా మండలి సైకో సోషల్ కౌన్సెలింగ్ సేవలను ఉపయోగించుకోవాలని ప్రజలను సీపీ మహేశ్ భగవత్ కోరారు. 04048214800 నంబర్‌కు ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు, సోమవారం నుంచి శనివారం వరకు ఎవరైనా కాల్ చేయవచ్చని స్పష్టం చేశారు. నేరెడ్మెట్ రాచకొండ సీపీ కార్యాలయంలో 'సైకో సోషల్ కౌన్సిలింగ్' కౌన్సిలర్లతో సీపీ, జాయింట్ సీపీ సుధీర్ బాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కరోనా మహమ్మారి కారణంగా 14 రోజుల పాటు ఒంటరితనం, ఒత్తిడి, నిరాశ, ఒంటరితనం, భయాలు, దుఃఖం, ఆందోళనతో బాధపడుతున్న అనేక సందర్భాలను చూసి.. అందరికీ మానసిక సామాజిక సలహా సేవలను ప్రారంభిస్తున్నామని సీపీ పేర్కొన్నారు.