తెలంగాణ

telangana

ETV Bharat / state

'సాంకేతికత, ఆధునిక పరిజ్ఞానంతో వేగంగా కేసుల ఛేదన' - telangana news

సాంకేతికత, ఆధునిక పరిజ్ఞానంతో వేగంగా కేసులను ఛేదిస్తున్నట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు. కమిషనరేట్‌ పరిధిలోని రెండు కేసుల్లో నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.

rachakonda cp mahesh bhagavat
'సాంకేతికత, ఆధునిక పరిజ్ఞానంతో వేగంగా కేసుల ఛేదన'

By

Published : Apr 8, 2021, 6:44 PM IST

హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో తాను పనిచేస్తున్న కంపెనీకి చెందిన డబ్బుతో ఓ వ్యక్తి పరార్యయాడు. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటై డబ్బు పోగొట్టుకున్న నవీన్‌రెడ్డి.. సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. మరో ఇద్దరితో కలిసి తాను పనిచేసే జేబీ ఇన్​ఫ్రా కంపెనీకి చెందిన సుమారు రూ.50 లక్షలతో ఉడాయించాడు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకున్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఉద్యోగులను నమ్మి ఎక్కువ మెుత్తం నగదు అప్పజెప్పకూడదని సీపీ సూచించారు. వీరి నుంచి రూ.28 లక్షల 69 వేలు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

చోరీ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరు అరెస్టు

మరో కేసులో సరూర్‌నగర్‌లో మంగళవారం అపహరణకు గురైన బాలుడ్ని పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కొత్తపేట పరిధిలో భిక్షాటన చేసే మహిళ తన రెండేళ్ల బాలుడిని ఉంచి... బయటకు వెళ్లి వచ్చేసరికి చిన్నారి లేకపోవడం వల్ల పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న సరూర్‌నగర్‌ పోలీసులు బాలుడిని ఓ వ్యక్తి తీసుకెళ్తున్నట్లు సీసీటీవీల ఆధారంగా గుర్తించారు. బాలుడిని అపహరించి ఆటోలో తీసుకెళ్లిన వ్యక్తిని ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగానే కేసును 30 గంటల్లోనే ఛేదించినట్లు సీపీ మహేశ్‌ భగవత్‌ స్పష్టం చేశారు.

సరూర్‌నగర్‌లో అపహరణకు గురైన బాలుడు క్షేమం

ఇదీ చదవండి:రాష్ట్రంలో రూ. 1,020 కోట్లతో రహదార్ల నిర్మాణం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details