తెలంగాణ

telangana

By

Published : Apr 23, 2021, 9:23 PM IST

ETV Bharat / state

'నిబంధనలు పాటించండి... కొవిడ్​ కట్టడికి సహకరించండి'

రెండో విడతలో రాచకొండ పోలీస్​ కమిషనరేట్‌ పరిధిలో 225 మంది పోలీసులు కొవిడ్​ బారిన పడ్డారని సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు. ఇప్పటికే కమిషనరేట్‌ పరిధిలో 95శాతం మంది సిబ్బందికి వ్యాక్సినేషన్​ పూర్తయిందని వెల్లడించారు.

cp mahesh bhagavat
rachakonda cp

రాష్ట్రంలో కొవిడ్​ కేసులు భారీగా పెరుగుతున్నాయని రాచకొండ సీపీ మహేశ్​భగవత్​ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాజాగా కమిషనరేట్​ పరిధిలో 225 మంది పోలీసులకు కొవిడ్​ సోకిందని... వారిలో నలుగురు మినహా అంతా ఇంటివద్దనే చికిత్స తీసుకుంటున్నారన్నారు. వారిలో ధైర్యాన్ని నింపేందుకు వారితో తరచూ జూమ్​ ద్వారా మాట్లాడుతున్నామన్నారు.

కర్ఫ్యూ నింబంధనలు ఉల్లంఘింస్తే కఠిన చర్యలు

కర్ఫ్యూ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. కమిషనరేట్‌ పరిధిలో 43 పోలీస్​ చెక్​ పోస్టులు ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు 200 కేసులు పెట్టాం. మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారిపై వారంలో 16వేల కేసులు పెట్టాం. 90శాతం దుకాణాలు, బార్లు, మద్యం దుకాణాలు, కార్యాలయాలు రాత్రి 8 గంటలకు మూసివేస్తున్నారు. మరో పది శాతం మాత్రమే... ఒత్తిడి చేసే వరకు మూయిడం లేదు. కొవిడ్​ కట్టడికి అంతా సహకరించాలి.

-మహేశ్​ భగవత్​, రాచకొండ సీపీ

ఇదీ చూడండి:కొవిడ్​ నుంచి కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే : తలసాని

ABOUT THE AUTHOR

...view details