ఎటువంటి సమయంలోనైనా పోలీసులు సేవలందిస్తున్నారని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. చెరువుల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశామన్నారు.
వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటున్నాం:మహేశ్ భగవత్ - వివిధ శాఖలతో సమన్వయం
వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించడంతోపాటు.... లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించడంలో పోలీస్ శాఖ ఎంతో కీలక భూమిక పోషిస్తోంది. భారీ వర్షాలు వరదల్లో ప్రాణాలకు తెగించి పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రానున్న మూడు రోజులు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు చేపడుతున్న చర్యలపై...రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.
![వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటున్నాం:మహేశ్ భగవత్ rachakonda-cp-mahesh-bhagat-said-we-are-coordinating-with-various-departments](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9236641-321-9236641-1603119432366.jpg)
వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటున్నాం:మహేశ్ భగవత్
వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటున్నాం:మహేశ్ భగవత్
నిత్యం వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని ఆయన అన్నారు. ఎంతో మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.
ఇదీ చూడండి :'థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత రైల్వే స్టేషన్లోకి అనుమతి'