తెలంగాణ

telangana

ETV Bharat / state

పదేళ్ల బాలుడికి భోజనం పెట్టించిన సీపీ మహేశ్ భగవత్‌ - సీపీ మహేశ్​ భగవత్​ తాజా వార్తలు

పోలీసులు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. ఓ పదేళ్ల బాలుడి ఆకలి తీర్చారు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్. తానే స్వయంగా బాబుతో మాట్లాడి భోజనం పెట్టించారు. అనంతరం ఆయన ఎస్కార్ట్‌ ద్వారా లంగర్‌ హౌస్‌ పోలీసులకు అప్పగించారు.

పదేళ్ల బాలుడికి భోజనం పెట్టించిన సీపీ మహేశ్ భగవత్‌
పదేళ్ల బాలుడికి భోజనం పెట్టించిన సీపీ మహేశ్ భగవత్‌

By

Published : Jul 27, 2020, 12:53 PM IST

ఆదివారం రాత్రి సమయంలో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌.. ఆయన ఇంటికి వెళ్తుండగా హైదరాబాద్‌ లంగర్ హౌస్ వద్ద ఓ పదేళ్ల బాలుడు ఆకలితో బాధ పడడం గుర్తించారు. తానే స్వయంగా ఆ బాబుతో మాట్లాడి భోజనం పెట్టించారు. ఆ తర్వాత వెంటనే బాలుడిని తన ఎస్కార్ట్ ద్వారా లంగర్ హౌస్ పోలీసులకు అప్పగించేలా చూశారు.

లంగర్ హౌస్ పోలీసులు బాబుని విచారించగా తాను ఇంటిలో గొడవపడి వచ్చినట్లు చెప్పాడు. బాలుడిని వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.

ఇవీ చూడండి:శరవేగంగా వైరస్​ వ్యాప్తి‌.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు

ABOUT THE AUTHOR

...view details