Rachakonda CP Counselling to Rowdy Sheeters :రౌడీషీటర్స్ ఈ కొత్త సంవత్సరం సందర్భంగా తమలో మార్పు తెచ్చుకొని నేర ప్రవృత్తిని మార్చుకుని సమాజంలో కలవాలని, సాధారణ పౌరుల్లాగా నూతన జీవితం ప్రారంభించాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు(CP Sudheer Babu) సూచించారు. పిల్లలు తమ తల్లిదండ్రులను చూసి ఎదుగుతారని, అందుకని రౌడీషీటర్లు(Rowdy sheeters) నేర ప్రవృత్తిని వదిలి తమ పిల్లల భవిష్యత్తును ఉన్నత శిఖరాల వైపు నడిపించేలా బాధ్యత వహించాలని ఆయన సూచించారు. నేరస్థులు తొందరపాటులో నేరాలు చేసినా సరే తప్పు చేయని వారి కుటుంబం కూడా దాని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
న్యూ ఇయర్ వేళ హైదరాబాద్‌లో డ్రగ్ టెస్టులు : రాచకొండ సీపీ
Rachakonda CP Sudheer Babu :డాక్టర్ల బిడ్డలు డాక్టర్లు అవుతున్నారని, పోలీసు ఆఫీసర్స్ పిల్లలు పోలీసులు అవుతున్నారని, రౌడీ షీటర్స్ పిల్లలు తమ తల్లిదండ్రులను అనుసరిస్తే నేరస్థులుగా తయారవుతారని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు. నేర ప్రవృత్తిని మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నామని, మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రౌడీషీటర్‌గా ఉన్న ప్రతీ ఒక్కరిపై ప్రత్యేక బృందాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.