ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంలో సర్కారు తాత్సారం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. సుమారు 50వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా వుంటే కేవలం 8,792 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి వాటిని కూడా భర్తీ చేయకపోవడం దారుణమన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వడంలేదని మండిపడ్డారు. ఉద్యోగాల కోసం అభ్యర్థులు నిరసన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు.
'ఇంటికో ఉద్యోగం అన్నారు... ఊరికొకటి కూడా లేదు'
టీఆర్టీ ఉద్యోగాలను తక్షణమే భర్తీచేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు మద్దతుగా అభ్యర్థులతో కలిసి నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ముందు ధర్నాలో పాల్గొన్నారు.
r-krishnayya