'ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సత్వరమే భర్తీ చేయాలి' - bc problems to be resolve
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షలకు పైగా ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు సమస్యలపై సచివాలయంలో సీఎస్ ఎస్కే జోషిని కలిసి పరిష్కరించాలని కోరారు.
ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. వివిధ శాఖల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను సీఎస్‌కు అందజేసినట్లు వెల్లడించారు. నూతనంగా ప్రకటించిన జిల్లాల్లో పూర్తిస్థాయిలో ఉద్యోగులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ కౌన్సెలింగ్‌లో బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని... అందువల్ల 262 ఎంబీబీస్ సీట్లను విద్యార్థులు కోల్పోయారన్న విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బీసీ గురుకుల పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.