రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 40 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ ఐకాస.. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నాకు ఆర్. కృష్ణయ్య మద్దతు తెలిపారు.
ఖాళీగా ఉన్న 40 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి: కృష్ణయ్య - టీచర్ పోస్ట్‌లను భర్తీ చేయాలని ఆర్. క్రిష్ణయ్య ధర్నా హైదరాబాద్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 40 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ ఐకాస చేపట్టిన ధర్నాకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందన్నారు. తెలంగాణ ఏర్పడితే ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి.. ఆరేళ్లు గడుస్తున్నా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు.
ఖాళీగా ఉన్న 40 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి: కృష్ణయ్య
తెలంగాణ ఏర్పడితే ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి.. ఆరేళ్లు గడుస్తున్నా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ఆర్. కృష్ణయ్య ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు , మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని విమర్శించారు. ఉద్యోగాల భర్తీ కోసం ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. లేనిపక్షంలో ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని కృష్ణయ్య హెచ్చరించారు.