తెలంగాణ

telangana

ETV Bharat / state

సురేశ్​ యాదవ్​పై దాడి హేయమైన చర్య: ఆర్​.కృష్ణయ్య - ఆర్.కృష్ణయ్య వార్తలు

నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్న విద్యార్థి సంఘ నాయకుడు సురేశ్​ యాదవ్​పై జరిగిన దాడిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఖండించారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేశ్​ యాదవ్​ను ఆయన పరామర్శించారు.

r krishnaiah meet with ou student suresh yadav in hyderabad
సురేశ్​ యాదవుపై దాడి హేయమైన చర్య: ఆర్​. కృష్ణయ్య

By

Published : Dec 19, 2020, 5:13 PM IST

ఓయూలో జరిగిన దాడిలో గాయపడిన విద్యార్థి సంఘ నాయకుడు సురేశ్​ యాదవ్​ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పరామర్శించారు. నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్న సురేశ్​ యాదవ్​పై దాడి చేయడాన్ని ఖండించారు. ఈ దాడి యావత్ నిరుద్యోగులపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం దాడులను ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తే... ప్రజలు కూడా తమ ఓటుతో దాడి చేసేందుకు సన్నద్ధం అవుతున్నారన్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే... దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో పట్టిన గతే రానున్న ఎన్నికల్లో ఎదురవుతుందని కృష్ణయ్య హెచ్చరించారు.

ఇదీ చదవండి:'జనవరి తొలివారం నుంచి ఉచిత తాగునీటి సరఫరా'

ABOUT THE AUTHOR

...view details