తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యావాలంటీర్లను రెగ్యూలర్ చేయాలి: ఆర్​.కృష్ణయ్య - ఆర్ కృష్ణయ్య ధర్నా వార్తలు

పాఠశాలలు, కళాశాలలో ఉపాధ్యాయులు, అధ్యాపాకులను భర్తీ చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్రంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు.

r krishnaiah-demands-education-volunteers-should-be-regularized
విద్యావాలంటీర్లను రెగ్యూలర్ చేయాలి: ఆర్​.కృష్ణయ్య

By

Published : Feb 5, 2021, 7:10 PM IST

పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు, బోధన సిబ్బంది లేకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆర్​.కృష్ణయ్య మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం పని చేస్తున్న విద్యా వాలంటీర్లను రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేస్తూ... బషీర్​బాగ్​లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. తెలంగాణ నిరుద్యోగ ఐకాస అధ్యక్షుడు నీల వెంకటేష్ ఆధ్వర్యంలో విద్యా వాలంటీర్లు ఆందోళనకు దిగారు.

కార్యాలయం లోపలికి వెళ్లేందుకు విద్యావాలంటీర్లు యత్నించగా... పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా పని చేస్తున్న విద్యా వాలంటీర్లను ఎందుకు పర్మినెంట్ చేయడం లేదని ఆర్​.కృష్ణయ్య ప్రశ్నించారు. కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ... విద్యా ప్రమాణాలు పెంచుతున్న వారిపై ఉన్నతాధికారులు చిన్న చూపు చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన 50 వేల ఉద్యోగాల భర్తీ కంటే ముందు... విద్యా వాలంటీర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, విద్యార్థి సంఘాలను ఐక్యం చేసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై నేతలతో సీఎం సమీక్ష

ABOUT THE AUTHOR

...view details