చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేవరకు పోరాటం కొనసాగిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు నీల వెంకటేశ్ నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
గుజ్జర్ల తరహాలో బీసీల ఉద్యమం : ఆర్. కృష్ణయ్య - రిజర్వేషన్ల కోసం పోరాడాలంటూ ఆర్.కృష్ణయ్య పిలుపు
ఈ పార్లమెంట్ సమావేశాల్లో 'చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల బిల్లు'ను ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను అణచివేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వం దిగిరాకపోతే గుజ్జర్ల తరహాలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
గుజ్జర్ల తరహాలో బీసీల ఉద్యమం : ఆర్. కృష్ణయ్య
పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం దిగిరాకపోతే బీసీలంతా కలిసి గుజ్జర్ల తరహాలో ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలు బీసీ బిల్లులపై తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. రిజర్వేషన్లు అమల్లోకి వస్తే బీసీలు రాజకీయంగా ఎదుగుతారని అన్నారు. యువత పెద్దఎత్తున ముందుకువచ్చి రాజ్యాధికారం కోసం పోరాడాలని ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు.