దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా ఆర్.ధనంజయు బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసు 1988 బ్యాచ్‌కు చెందిన ఈయన... దక్షిణ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించారు. రైల్వే సర్వీసుల్లో మూడు దశాబ్దాలకుపైగా ఆపరేషన్స్, కమర్షియల్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాల్లో వివిధ హోదాల్లో సేవలనందించారు.
ద.మ.రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్‌కు నూతన మేనేజర్ - telangana latest news
దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ నూతన మేనేజర్‌గా ఆర్.ధనంజయును నియమించారు. మూడు దశాబ్దలకుపైగా రైల్వే సర్వీసుల్లో విధులు నిర్వహించారు.
దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ నూతన మేనేజర్
విశాఖపట్నం సౌత్ కోస్ట్ రైల్వే ప్రత్యేక అధికారిగా కూడా విధులు నిర్వహించారు. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గ్రూప్ జనరల్ మేనేజర్‌గా పనిచేసిన ఆయన.. వివిధ అధికారిక పనుల్లో భాగంగా జర్మనీ, బెల్జియం, ఇటలీ, చైనా, సింగపూర్ తదితర దేశాల్లో పర్యటించారు.
ఇదీ చదవండి:ఎమ్మెల్యే హైడ్రామా.. బట్టలు చించుకొని ఆందోళన